వరుసగా రెండో రోజు నష్టాలో స్టాక్ మార్కెట్లు

నేడు కూడా దేశీయ మార్కెట్ లో మార్పు లేదు. ఈ రోజు కూడా భారీ నష్టాలతో ముగిసింది. వరుసగా ఆరో సెషన్ లో నష్టాల పర్వం కొనసాగుతోంది. మానిటరీ పాలసీని మరింత కఠినతరం చేస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన ప్రకటన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.

ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 509 పాయింట్లు నష్టపోయి 56,598కి పడిపోయింది. నిఫ్టీ 148 పాయింట్లు కోల్పోయి 16,858కి దిగజారింది. హెల్త్ కేర్, ఐటీ, టెక్, ఆటో సూచీలు మినహా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. మరోపక్క, ఆసియా-పసిఫిక్ మార్కెట్లన్నీ ఈరోజు నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.