200 కిలోమిటర్లు ప్రయాణించి కుక్కను రక్షించిన యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సభ్యులు

200 కిలోమిటర్లు ప్రయాణించి కుక్కను రక్షించిన యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సభ్యులు

 

నిజామాబాద్: శుక్రవారం రోజు రాత్రి హైదరాబాద్ లోని యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సోసైటి వారికి ఎవరో ఒక వ్యక్తి పోన్ చేశాడు. వేంటనే వారు నిమిశం అలస్యం చేయకుండా హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు ప్రయణం మొదలుపెట్టారు. సుమారు 200 కిలోమిట్లరు ప్రయాణించిన ఐదుగురు యువకులు. వారు నిర్మానుష్య ప్రాంతంలోని ఒ పాడుబడ్డ బావీ దెగ్గరికి యువకులు చేరుకున్నారు. అ బావి ప్రాంతం పూర్తిగా చీకటీతో కప్పబడి ఉండి. పాడుబడ్డ బావిలోకి తోంగిచూసిన అ యువకులు అక్కడో దినమైన స్థితిలో ఉన్న కుక్కను వారు చూశారు.

యువకులను గమనించిన అ కుక్క మెల్లగా అరవడం మొదలు పెట్టింది. యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సభ్యుడు తాడు సాయంతో అ పాడుబడ్డ బావిలోకి దిగి కుక్కను పైకి తీసుకోచ్చాడ్డు. కోన ఊపిరితో కొట్టుమిట్టులాడుతున్న అకుక్కకు ప్రాధమిక చికిత్స అందించి దానికి పునర్జీవం పోశారు.

అది నిజాం కాలం నాటి పూరాతన బావి
నిజాం కాలంలో నిర్మించిన పూరాతన వ్యవసాయ బావి అది నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామ శివారులో ఉంది. గత 20 రోజుల నుండి అ బావిలో ఒ 4 సంవత్సరాల కుక్క పిల్ల పడింది. అ బావిల చాల ఎక్కవ లోతులో ఉంది దాంట్లో చూక్క నీరు కుడా లేదుబావి చూట్టు దట్టమైన చెట్లు ఉన్నాయి. అ బావీ లోనుండి శబ్ధం రావడంతో అటుగా వెల్తున్న ఓ వ్యక్తి గమనించి బావి లోకి తోంగి చూశాడు.అందులో ఉన్న చిన్న కుక్క పిల్లను చూసి దాని కాపాడాలని ఎంతో ప్రయత్నించాడు కాని అతనికి అది సాధ్యం కలేకపోయింది.

చేసేది ఎమి లేక అ కుక్కకు రోజు బావిలోకి తినడానకి అహారం వేసే వాడు కాని అ కుక్క అరుస్తు భయపడేది. అ కుక్క పిల్ల ఆరోగ్యం రోజు రోజుకి క్షిణిస్తు వస్తుంది. దాని ఎలాగైన రక్షించాలని ఇంటర్ నెట్ లో రక్షించే వారి కోసం చూశాడు. అప్పడు అతడికి నగరంలోని యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సోసైటి వారి నెంబర్ దోరికింది వెంటనే వారికి పోన్ చేసి విషయం చేరవేశాడు.

యానిమల్ వారియర్ కన్జర్వేషన్ ప్రధన కార్యదర్శి సంజీవ్ శర్మ అతనితో పాటు నలుగురు సభ్యులు అ ప్రాంతానికి బయలుదేరారు. కరోన లాంటి విపత్కర సమయంలో కుడా ఓ కుక్కను కాపాడేందు సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించి దాని రక్షించారు. యానిమల్ వారియర్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.

One Comment on “200 కిలోమిటర్లు ప్రయాణించి కుక్కను రక్షించిన యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సభ్యులు”

Leave a Reply

Your email address will not be published.