ఈ ఔషధాలు జలుబు నివారణకు వాడొద్దు..
ఆర్.బి.ఎం డెస్క్ : నాలుగేళ్ల వయస్సు కంటే తక్కువ వయసున్న చిన్న పిల్లల్లో జలుబు నివారణకు వాడే ఔషధాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC)తో తయారైన ఔషధాల వినియోగాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) నిషేధించినట్లు సమాచారం. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా ఆవిష్కరించినట్లైతే దానిని ఎఫ్‌డీసీ ఔషధంగా పరిగణిస్తారు. ఈ ఔషధాల సహేతుకత నిర్ధారణ కాలేదని పైగా వీటివల్ల ప్రజలకు పెను ప్రమాదం తలెత్తవచ్చని అధికారులు వెల్లడించారు.