కిరాణ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పులిమామిడి గ్రామ సర్పంచ్ విమల రంగారెడ్డి ..
ఆర్.బి.ఎం డెస్క్: నవాబ్‌పేట్ మండల్ పరిధిలోని పులిమామిడి గ్రామంలో నూతన కిరాణ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గ్రామా సర్పంచ్ విమల రంగారెడ్డి . కిరాణ షాప్ ని ప్రారంభించిన అనంతరం విమలరంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా నిబంధనలను పాటించాలని విమల రంగారెడ్డి సూచించారు. పులిమామిడి గ్రామా ప్రజలు కూడా కరోనా పట్ల అశ్రద్ధ వహించకూడదని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని విమల రంగారెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి పై గ్రామంలో మరింత అవగాహన కల్పించేందుకు గ్రామంలోని యువకులు ముందుకు రావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ,జడ్పీటీసీలు, ఉప్ప సర్పంచ్ u. సుధాకర్, వార్డు మెంబర్ ఇబ్రహీం తదితర నాయకులు పాల్గొన్నారు.
SERP ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ కిరాణా షాప్ మంచి లాభాలతో ముందుకు పోవాలని ఆశిస్తూ… SERP ద్వారా నిరుద్యోగులకు స్వయం ఉపాధి లభిస్తుంది. ఇదొక చక్కటి అవకాశం.