రూ.100కోట్ల విలువైన భూమిని టీఆర్ఎస్ పార్టీకి ఎలా కేటాయిస్తారు?: దాసోజు శ్రవణ్
ఆర్.బి.ఎం హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పేదల సొమ్మును దోచుకుంటోందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ భవన్‌కు దగ్గరలోనే మళ్లీ అదే పార్టీకి.. ఎకరాకు పైగా భూమి ఎందుకు కేటాయిస్తున్నారు? అని ప్రశ్నించారు.
రూ.100కోట్ల విలువైన భూమిని టీఆర్ఎస్ పార్టీకి ఎలా కేటాయిస్తారు? అని నిలదీశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతామని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.
One Comment on “రూ.100కోట్ల విలువైన భూమిని టీఆర్ఎస్ పార్టీకి ఎలా కేటాయిస్తారు?: దాసోజు శ్రవణ్”