క్యాసారంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..

క్యాసారంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..

ఆర్.బి.ఎం డెస్క్,క్యసారం: పటాన్ చేరు నియోజకవర్గం క్యసారం గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఈ నేపథ్యంలో కురుమ సంఘం అధ్యక్షుడు మేటి ఈశ్వర్ యాదవ్ మాట్లాడుతూ ధర్మస్థాపనా కర్తవ్యానికి స్మృతిచిహ్నమే శ్రీకృష్ణ జన్మాష్టమి అని ఈశ్వర్ యాదవ్ అన్నారు. ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలని ఈశ్వర్ యాదవ్ ఆకాంక్షించారు.శ్రీకృష్ణతత్వం మానవాళికి విజయమంత్రమన్నారు.వినయం, నిజాయితీ, శ్రమ, ధర్మం, దుర్మార్గాన్ని దూరంగా పెట్టడం వంటివి శ్రీకృష్ణుడు చెప్పిన విజయానికి ఐదు మంత్రాలని ఈశ్వర్ యాదవ్ పేర్కొన్నారు. క్యసారం గ్రామంలో ప్రతీ ఏటా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు ఆధ్యాత్మికతకు చింతనతో పాటు సంస్కృతిక వికాసానికి ప్రతీకగా నిలుస్తాయని ఈశ్వర్ యాదవ్ అన్నారు. శ్రీకృష్ణ భగవానుడి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్బంగా మేటి ఈశ్వర్ యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, ఎం.దశరధ్, ఎస్.శ్రీనివాస్, పోచయ్య, ఎం.ప్రభాకర్, వెంకటేశం,  ఎస్.మల్లేష్, క్యసారం గ్రామ ఉప సర్పంచ్ విక్రమ్ రెడ్డి, ఏ.సుధాకర్ రెడ్డి, ఎండి.హమీర్, ఏ.సుభాష్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.

One Comment on “క్యాసారంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..”

Leave a Reply

Your email address will not be published.