తెలంగాణలో హీరో ఎవరూ.. కేసీఆర్ బండి సంజయ్, రేవంత్ రెడ్డి

తెలంగాణలో హీరో ఎవరూ.. కేసీఆర్ బండి సంజయ్, రేవంత్ రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రికోణ పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా వైఎస్ షర్మిల రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బహుజన రాజ్యం అంటూ బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రంగ ప్రవేశం చేశారు. ఏనుగెక్కి ప్రగతిభవన్ పోతారా కారుకిందపడిపోతారా అంటూ ఏకంగా ప్రగతిభవన్‌లో అడుగుపెట్టేందుకు బహుజనులను ఏకం చేస్తున్నారు. అయితే వీరందరీ ఉమ్మడి టార్గెట్ సీఎం కేసీఆర్ కావడం గమనార్హం.

అయితే పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని కాంగ్రస్ అధిష్టానం నియమించడంతో ఆ పార్టీకి ఊపిరిపోసినట్లయింది. ధ‌ర్నాల‌తో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు. ద‌ళిత‌-గిరిజ‌న దండోరాతో కేసీఆర్ ద‌ళిత బంధు ఎత్తుగ‌డ‌కు విరుగుడు మంత్రం పారిస్తున్నారు. వ‌రుస‌బెట్టి భారీ బ‌హిరంగ స‌భ‌ల‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్నారు రేవంత్‌రెడ్డి. చేష్ట‌లుడిగి, స్త‌బ్దుగా మారిన కాంగ్రెస్‌లో పున‌రుత్తేజం నింపుతున్నారు. రెండు నెల‌లుగా తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి పేరు డైన‌మైట్‌లా పేలుతున్నారు.

అంతకుముందు టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ భావించింది. అదే నినాదంలో ప్రజల్లోకి వెళ్లింది. రేవంత్ దూకుడుతో బీజేపీ కాస్త వెన‌క్కి త‌గ్గింది. అయితే ఇప్పుడు పంజా విసిరి దాడి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. బీజేపీ ర‌థ‌సార‌ధి బండి సంజయ్ టాప్ గేర్‌లో దూసుకొస్తున్నారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో తెలంగాణ‌ను చుట్టేయ‌నున్నారు. బీజేపీ బండికి ఫ‌స్ట్ టార్గెట్ హుజురాబాద్‌.. మెయిన్ టార్గెట్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందరూ తమ బాణాలను ప్రగతిభవన్‌ వైపే ఎక్కుపెడుతున్నారు. ప్రగతిభవన్‌లో పీఠాన్ని అధిష్టించే హీరో ఎవరో వేచి చూడాలి.

కలెక్టర్‌ వాహనానికి 23 చలానాలు.. పట్టించుకోని పోలీసులు! ఈ వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

2 Comments on “తెలంగాణలో హీరో ఎవరూ.. కేసీఆర్ బండి సంజయ్, రేవంత్ రెడ్డి”

Leave a Reply

Your email address will not be published.