సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి :బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ  నేత

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి

:బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ  నేత

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన  హర్యానా గవర్నర బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు బి. జనార్దన్ రెడ్డి.

 

ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన వీరులకు వందనమన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని ఆయన పేర్కొన్నారు. సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదని, సర్దార్‌ పటేల్‌ వల్లే నిజాం పాలన అంతమైందని ఆయన అన్నారు. తెలంగాణ చరిత్రను కొందరు వక్రీకరించారని, నరేంద్రమోదీ ప్రధాని అయ్యాకే ఆ పొరపాటును సరిచేశారని జనార్దన్ రెడ్డి అన్నారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా వక్రీకరించిందని ఆయన విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా బి.జనార్దన్ రెడ్డి అన్నారు.

One Comment on “సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వల్లే తెలంగాణకు విముక్తి :బి.జనార్దన్ రెడ్డి, బీజేపీ  నేత”

Leave a Reply

Your email address will not be published.