నిరాధార ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి: కవిత,ఎమ్మెల్సీ

నిరాధార ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి: కవిత,ఎమ్మెల్సీ

ఆర్.బి.ఎం హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సాలపై పరువునష్టం కవిత దావా వేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తనపై నిరాధార ఆరోపణలు చేశారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత లాయర్లు కోరారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రతివాదులకు నోటీసులు లేదా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్ట దావా వేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నాయకులు కవితపైన నేరుగా ఆరోపణలు చేశారు. ఇందులో కవిత భర్త తరఫు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మరికొన్ని వివరాలను బయటపెట్టాయి. ఈ కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని బీజేపీ నేత పర్వేశ్‌ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా ఆరోపించారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర గురించి కేసీఆర్‌కు తెలిసే ఉంటుందని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కవిత డీల్‌ కుదుర్చుకున్న తర్వాతనే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కేసిఆర్‌ కలుసుకోవడం, పంజాబ్‌కు వెళ్లి రైతులకు డబ్బులు పంచిపెట్టడం జరిగిందని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు.

One Comment on “నిరాధార ఆరోపణలపై బహిరంగ క్షమాపణ చెప్పాలి: కవిత,ఎమ్మెల్సీ”

Leave a Reply

Your email address will not be published.