సమంత అక్కినేని సినిమాలకు బ్రేక్ .. దానికి కారణం అదే..!

సమంత అక్కినేని సినిమాలకు బ్రేక్ .. దానికి కారణం అదే..!

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సమంత అక్కినేని తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన అందాల భామ. తాను ఎంచుకునే కథ రొటీన్ గా కాకుండా ఎప్పుడు యూనిక్ గా ఉండే విధంగా సమంత జాగ్రత్త పాడుతారు. సమంత తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న స్టోరీనే ఎంచుకుంటారు అందువల్లే సమంత అన్ని హిట్లను అందిపుచ్చుకుంటున్నారు. పెళ్ళైన తరవాత కూడా ఈ భామకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదనే చూపొచ్చు. ఈ అందాల భామకు ఇటీవల కాలంలో చాల వివాదాలు చుట్టుముట్టాయి. అందులో సమంతను చుట్టిన ముఖ్యమై వివాదం తన ట్విట్టర్ అకౌంట్లో తన పేరులో నుండి అక్కినేని తీసేయడం.

అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్యతో వివాహమైన కొద్దీ రోజులకే సమంత తన సోషల్ మీడియా అకౌంట్లన్నిటికి అక్కినేని అని తన పేరులో జతచేసుకుంది. అయితే తాజాగా సమతా తన ట్విట్టర్ అకౌంట్లో అక్కినేని అనే పేరు తొలగించింది. దింతో నాగచైతన్యకు సమంతకు గొడవలు జరిగాయని అందువల్లే సమంత అక్కినేని పదం తీసేసింది అని సోషల్ మీడియాలో కొంత మంది ఎవరికి నచ్చిన విధంగా వారు ఊహించుకున్నారు. సోషల్ మీడియా తనపై జరుగుతున్న తతంగం అంత సమంతకు చేరడంతో తాజాగా సమంత ఈ అంశంపై స్పందించింది.

సోషల్ మీడియా వేదికగా తన పై వస్తున్న ట్రోల్ల్స్ గురుంచి వివాదాలను గురుంచి నేను మాట్లాడాను అంటూ సమయం వచ్చినప్పుడే మాట్లాడతాను అని సమంత చెప్పుకొచ్చారు. ఈ వివాదాల పై నేను స్పందించను అని సమంత నిక్కచ్చిగా చెప్పింది. కొద్దీ రోజులపాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నానని, ఇప్పటి వరకు తాను సైన్ చేసిన చిత్రాలను ముగించేశానని ప్రస్తుతం కొత్త సినిమాలకు సైన్ చేయలేను అని సమంత తెలిపారు. కొద్దీ రోజులు సినిమాలకు బ్రేక్ తీసుకొని అనంతరం కొత్త స్టోరీలు వినాలనుకుంటున్నానని సమంత అన్నారు. అయితే సమంత మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత ప్రెగ్నెట్ అయినందు వల్లే సినిమాలకు కొద్దీ రోజులు బ్రేక్ ఇచ్చిందని సమంత అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

One Comment on “సమంత అక్కినేని సినిమాలకు బ్రేక్ .. దానికి కారణం అదే..!”

Leave a Reply

Your email address will not be published.