గర్భవతి అని తెలిసిన మరుసటి రోజే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

సాధారణంగా మహిళలు గర్భం దాల్చిన మూడు నెలల నుంచి ఆమెలో అనేక మార్పులు సంభవిస్తాయి. వాంతులు, వికారం లక్షణాలతో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మూడు నెలల నుంచి సదరు మహిళ శరీర ఆకృతితో మార్పులు కూడా జరుగుతాయి. కొందరిలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు. ప్రసవించిన తర్వాత ఈ రెండు వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. డాక్టర్ పర్యవేక్షణలో నిత్యం ఉంటూ ఆరోగ్య సూత్రాలను క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ప్రతి నెల స్కానింగ్ చేస్తూ బిడ్డ కదలికను వైద్యులు గమనిస్తూ ఉంటారు. తొమ్మిదినెలల తర్వాత పండంటి బిడ్డను ఆ తల్లి లోకానికి పరిచయం చేస్తుంది. కానీ విచిత్రంగా ఓ మహిళ గర్భవతి అని తెలిసిన మరుసటి రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇది వినటానికి ఆశ్యర్యంగా ఉన్న నిజం. బ్రిటన్‌కు చెందిన మోలీ కిల్ బర్ట్ సెప్టెంబర్ 9న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందులో ఆశ్యర్యం ఏమిటిని అనుకుంటున్నారా.. తాను గర్భం దాల్చిన విషయాన్ని తెలుసుకోలేక పోయింది. ఆమె బరువు పెరగడం తప్పా ఇతర మార్పులు కనిపించలేదు. ఆమె ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కొంతకాలంగా ఆసుపత్రికి వెళ్తోంది. ఆమె గర్భంగా దాల్చిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది కూడా గమనించలేకపోయారు. తనకు బిడ్డ పుట్టడంపై మోలీ కిల్ బర్ట్ స్పందిస్తూ ఆరు నెలల కిందటనే సహజీవన భాగస్వామి నుంచి విడిపోయానని, అందువల్ల గర్భం వచ్చే అవకాశం లేదని భావించానని చెప్పింది. తన మాజీ భాగస్వామికి ఈ విషయం చెబితే నమ్మలేక పోయాడని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.