సీఎం అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాగా ఉండాలి: భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

సీఎం అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాగా ఉండాలి: భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. నకిరేకల్ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగాఎంపీ కోమటి రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు ఎంపీ కోమటిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెయ్యి రూపాయల కంటే ఎక్కువగా వైద్యానికి ఖర్చు అయితే ఆ ఖర్చు మొత్తం ఆరోగ్యశ్రీ లోకి వచ్చే విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఆయన అన్నారు.

ప్రస్తుతం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా చికిత్సను సైతం ఆరోగ్యశ్రీలో చేర్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన అభినందించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే జగన్ లా ఉండాలని ఆయన ప్రశంసించారు.కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా వైద్యం. పేదలు వైద్యం నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ లోకి వెళితే లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్ లేక ప్రైవేట్ హాస్పిటల్ వైపు వెళితే లక్షల్లో బిల్లులు చెల్లించలేక పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్టు కెసిఆర్ వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పక్క రాష్ట్రంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చారు కానీ మన తెలంగాణ ప్రభుత్వం కరోనా ను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చటం లేదంటూ ఆయన ప్రశ్నించారు.

మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయా? అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రశ్నించారు.మీ విలువైన ఓటు ఎవరికి వేస్తే బాగుంటుందో ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని ఆయన మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published.