సీఎం జగన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఫోన్..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: గత కొద్దీ రోజుల నుండి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ(63) ఈ రోజు పరమపదించారు. ఆమె ఆకస్మిక మరణంతో వేమూరి రాధాకృష్ణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ సతీమణి మృతిపట్ల సంతాపం తెలిపారు. ఈ క్రమంలో రాధాకృష్ణకు ఫోన్ చేసి జగన్ పరామర్శించారు.
ఆమె మృతికి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు అదేవిధంగా ఆంధ్రజ్యోతి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సంతాపం తెలిపారు.వేమూరి కనకదుర్గ మరణంతో వారి సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు.