కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్యే సీతక్క దీక్ష..

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎమ్మెల్యే సీతక్క దీక్ష..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా బారిన పడి పేద ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని డబ్బులు వెచ్చించి ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లలేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ లేక పేద ప్రజలు ప్రాణాలని కోల్పోతున్నారని కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఇందిరాపార్క్ వద్ద ప్రజారోగ్య దీక్షలో సీతక్క పాల్గొన్నారు. క‌రోనా బారినపడి ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న అర్హులంద‌రికీ సీఎంఆర్ఎఫ్ ద్వారా హాస్పిటల్ లో బిల్లు రూపంలో కట్టిన డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల‌ని సీత‌క్క డిమాండ్ చేశారు.

కరోనాతో మరణించిన వారిని వారి స్వస్థలాలకు తీసుకువెళ్ళంటే ప్రయివేటు అంబులెన్సులు సుమారు 25000 రూపాయలు వరకు తీసుకుంటున్నారని బాధితులు తన దగ్గరికి వచ్చి వారి ఆవేధన వ్యక్తం చేశారని సీతక్క అన్నారు.. అలంటి వారికీ ప్రభుత్వం ఉచిత అంబులెన్సు సదుపాయం కల్పించాలని ఆమె ప్రభుత్వాని కోరింది.

Leave a Reply

Your email address will not be published.