పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ఫోన్.. యువకుడి దుర్మరణం

పిడుగు పడి జేబులోనే పేలిన సెల్‌ఫోన్.. యువకుడి దుర్మరణం

ఆర్.బి.ఎం: పిడుగుపడటంతో జేబులోని సెల్‌ఫోన్ పేలి ఓ యువకుడు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం సూదవరపు జయంత్ తోపాటు మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి వారి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులో ఉన్న ఫోన్ పేలింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడితో పాటూ వస్తున్న మరో యువకుడికి తీవ్రమైన గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.

Leave a Reply

Your email address will not be published.