తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా అభివృద్ధి చెందింది.. ఏపీని వదిలి తెలంగాణకు వస్తా: జేసీ దివాకర్‌రెడ్డి

jc diwakarreddy tdp

తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా అభివృద్ధి చెందింది.. ఏపీని వదిలి తెలంగాణకు వస్తా: జేసీ దివాకర్‌రెడ్డి

ఆర్.బి.ఎం హైదరాబాద్: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో హల్‌చల్ చేశారు. అసెంబ్లీకి వచ్చి తన పాత మిత్రులతో సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా అవుతున్నాయి. నిన్న సీఎం కేసీఆర్‌ను దివాకర్‌రెడ్డి కలిశారు. ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తానని ఆయన చెప్పారు. ఏపీలో రాజకీయాలు బాగాలేవని, సమాజం కూడా బాగాలేదని దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్‌ను వదిలేసి తెలంగాణకు వస్తానన్న జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామన్నారు. గంతలోనే తాను జానారెడ్డి గెలవడం కష్టమని ముందే చెప్పానని.. ఆయన ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసని చెప్పారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని తెలిపారు. హుజూరాబాద్ గురించి తనకు తెలియదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయంగా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలకి వ్యతిరేకంగా మాట్లాడి షోకాజ్ నోటీస్ రప్పించుకోనని దివాకర్‌రెడ్డి అన్నారు. తాము ఆంధ్రలో ఎంత ఇబ్బందులకు గురవుతున్నామో వివరించారు. అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆంధ్రలో అల్లాడిపోతున్నామని వాపోయారు. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాము లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయోద్దని భావించినా రాజకీయ అనివార్య పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని దివాకర్‌రెడ్డి భాదపడ్డారు.

Leave a Reply

Your email address will not be published.