తప్పులో కాలేసిన కేటీఆర్… సూటిగా ప్రశ్నించిన రేవంత్

revanthreddy

తప్పులో కాలేసిన కేటీఆర్… సూటిగా ప్రశ్నించిన రేవంత్

ఆర్.బి.ఎం హైదరాబాద్: మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌ ఖాతాలో దేశం, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై స్పందిస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో పెట్టిన పొస్టులపై ఆయన స్పందించి వారి సమస్యలను పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల ఆయన చేసిన రెండు పోస్టుల్లో తప్పులు దొర్లాయి. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుణ్ని పోలీసులు పట్టుకోకపోయినా.. 24 గంటల్లోనే అరెస్టు చేశారంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అయితే కేటీఆర్ ట్విట్‌ను ఫాలో అయిన నెటిజన్లు పలు విమర్శలు సంధించారు. అయితే వెంటనే స్పందించిన కేటీఆర్ తప్పుడు సమాచారం వల్ల పొరపాటు జరిగిందని పేర్కొన్నారు.

ఇలా మరోసారి ఆయన ట్వట్టర్‌లో పొరపాటుగా పోస్టింగ్‌లు పెట్టారు. ఏపీలో వైద్య సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి రైతులకు, రైతు కూలీలకు కరోనా వ్యాక్సిన్‌ వేస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి, అది తెలంగాణలో జరిగినట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వం, తెలంగాణ ఆరోగ్య సిబ్బంది అంకితభావానికి ఇది నిదర్శనమని తెలిపారు. కేటీఆర్ ట్విట్‌ను పరిశీలించిన తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ తప్పుబట్టారు. కేటీఆర్‌ పోస్ట్‌ చేసిన ఫొటోల్లో ఒకటి ఏపీలోని విజయనగరం జిల్లాలో వ్యాక్సినేషన్‌కు సంబంధించినదని తెలుపుతూ మాణిక్కం ఠాగూర్‌ ట్విటర్‌లో వివరాలు వెల్లడించారు. పవన్‌ అనే వ్యక్తి దీనిని ఈ నెల 12న పోస్ట్‌ చేసినట్లుగా తెలిపారు. ప్రజలను మోసం చేసినందుకు కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ట్విట్‌పై రేవంత్‌రెడ్డి కూడా స్పందించారు. పరిహారం ఇవ్వాల్సిన పాలకుడు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే యువ రైతు రాజేశ్‌ ఆత్మహత్యలో నేరగాడు కేసీఆర్‌ కాదా? అంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published.