ఇప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ ఓడిపోవడం కాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..

jc prabhakar reddy

ఇప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ ఓడిపోవడం కాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..

ఆర్.బి.ఎం అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని తాడిపత్రి మునిసిపల్ చైర్ పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి.టీడీపీ పార్టీకి పని చేస్తున్న కార్యకర్తలను పట్టించుకోవడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు కనీసం ఇప్పుడైనా మేల్కోవాలి లేకపోతే కష్టం అని అన్నారు. టీడీపీ పార్టీలో కొందరి నేతలది మాత్రమే హావ నడుస్తుందని ఆయన అన్నారు. గడిచిన రెండేళ్లలో టీడీపీ కార్యకర్తలను ఒక్కరు కూడా పట్టించుకోలేరని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సదస్సులు అంటే కార్యకర్తలు వస్తారా? అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. సదస్సులు పెట్టాల్సింది నీటి ప్రాజెక్టులపై కాదని పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలను పట్టించుకోవాలి అని జేసీ అన్నారు. అనంతపురం లో ఉన్న టీడీపీ నాయకులు ఒక్క కార్యకర్తకు కూడా అండగా లేరని అన్నారు. అనంతపురం టీడీపీ కంచుకోట కాబ్బటి మేము నాయకులం అయ్యాం అని జేసీ ప్రభాకర్ అన్నారు. టీడీపీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి కార్యకర్తల మీటింగ్ పెట్టాలి కానీ ఇలాంటి పనికిరాని సదస్సులు శుద్ధ దండగే అంటూ జేసీ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రతి పక్షంలో ఉన్నపుడు ఈ ప్రాజెక్టులపైన అన్ని రాజకీయ పార్టీలు పోరాడాయి ఏమైనా అయిందా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం మధ్యలోనుండే వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published.