దమ్ముంటే టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చండి: కెసిఆర్

దమ్ముంటే టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చండి: కెసిఆర్

ఆర్.బి.ఎం హైదరాబాద్: బీజేపీ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్నికూల్చండి చూస్తాం అని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుబట్టారు. కేంద్రం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినవారిని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తాము మౌనంగా ఉండమని, కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూలుతుందని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ పడగొట్టాలని భావిస్తున్నారని, దమ్ముంటే టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చండి.. చూస్తాం అంటూ కేసీఆర్ సవాల్ విసిరారు. తాము ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, కేంద్రానికి సన్నిహితంగా ఉన్న వారికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఎంత దోచిపెట్టారో. ఆ లెక్కలు తమ వద్ద ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు. బీజేపీ అవినీతి చిట్టా త్వరలోనే బయటపెడతామని కేసీఆర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *