అభిమానుల దోస,టీ రుచులు అదిరాయి..
ఆర్.బి.ఎం: సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎల్ఏశ్రీకాంత్ రెడ్డికి ఓ అభిమాని తన టీ హోటల్ నందు ఇచ్చిన టీ, మరో అభిమాని తన టిఫిన్ సెంటర్ నందు ఇచ్చిన దోస రుచులు మైమరపించాయి. మోటకట్ల లోని రోడ్ వారిపల్లె నందు బాషూ అనే అభిమాని చిన్న టిఫిన్ సెంటర్ ను,తిమ్మారెడ్డి అనే మరో అభిమాని టీ కొట్టుకుని జీవనం సాగిస్తున్నారు.గడప గడప కు ప్రభుత్వం కార్యక్రమంలో ఇల్లు ఇల్లు తిరుగుతున్న శ్రీకాంత్ రెడ్డి ని తన టీ స్టాల్ ను సందర్శించాలని అభిమాని తిమ్మారెడ్డి కోరగా శ్రీకాంత్ రెడ్డి వెళ్లి టీ సేవించారు. రోజుకు పాలు ఎన్ని ఖర్చు అవుతున్నాయి. వ్యాపారం బాగుందా అని శ్రీకాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అలాగే బాషూ అనే అభిమాని టిఫిన్ సెంటర్ లో దోసను తిన్నారు.అభిమానంతో ఇచ్చిన దోస రుచిగా ఉందంటూ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.స్వయంశక్తితో అభివృద్ధి చెందుచున్న బాషూ, తిమ్మారెడ్డి లను శ్రీకాంత్ రెడ్డి అభినందించారు