ఫోటోగ్రాఫర్ ల నిరసన

ఫోటోగ్రాఫర్ ల నిరసన

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: అనంతపురంలో భాష అనే ఫోటోగ్రాఫర్ పై యెస్ అర్ గ్రాండ్ హోటల్ సిబ్బంది దాడికి పాల్పడటంతో తెలంగాణ ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రొఫెషన్స్ అసోసియేషన్స్ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది దింతో ఫోకస్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ కాప్ర సర్కిల్ ఆధ్వర్యంలో యెస్ అర్ గ్రాండ్ హోటల్ సిబ్బంది దాడికి నిరసనగా ఈ సి ఐ ఎల్ చౌరస్తా నుండి ఏ యెస్ రావు నగర్ మీదుగా ర్యాలీ నిర్వహించి ఈ సి ఐ ఎల్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్లు నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది సమాజానికి ఒక గుండెకాయ లాంటిదని ప్రతి రోజు జరిగే సంఘటనలు ప్రపంచానికి తెలియపరిచేది కేవలం ఒక ఫోటో మాత్రమే అని వారు తెలిపారు. మనుషులకు గుర్తింపు ఫోటో తో మాత్రమే దక్కుతుంది అలాంటి వృత్తిని గౌరవించి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుందని అలంటి వారిని గుర్తించాలి ఫోటో గ్రాఫేర్ లు అన్నారు. ఈ కార్యక్రమంలో టి పి వి పి ఏ రాష్ట్ర అధ్యక్షుడు యెస్ వి యెస్ వెంకట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అర్ వి రమనశ్రీ ఫోకస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ టి రమేష్ ప్రధాన కార్యదర్శి బి యెన్ భానుచందర్ కోశాధికారి జి. రాముగౌడ్ ఉపాధ్యక్షుడు రాజు జాయింట్ సెక్రటరీ నరేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ హరి యాదిరెడ్డి సభ్యులు సతీష్ పరమేష్ ఆంజనేయులు శ్రీకాంత్ గౌస్ భాయ్ నాగరాజు సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.