కాంగ్రెస్ లో చేరికపై స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు..

కాంగ్రెస్ లో చేరికపై స్పందించిన తుమ్మల నాగేశ్వరరావు..

ఆర్.బి.ఎం ఖమ్మం: ఇటీవల మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన ప్రచారాన్ని కొట్టిపారేశారు. సీఎం కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని తెలిపారు. కెసిఆర్ కు మద్దతు తెలుపుతూ ఆయన వెంట ఉండాల్సిన అవసరం ఉందని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. జిల్లా అభివృద్ధి కోసం తనను టీఆర్‌ఎస్‌లోకి కేసీఆర్ తీసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ సామాజికమాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని తుమ్మల ఖండించారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో నీతి, నిబద్ధతతో నిలబడ్డానే తప్ప ఎలాంటి విమర్శలకు తావివ్వలేదని తుమ్మల తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉండదని చెప్పారు. అందుకే సీఎం పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌లోకి వచ్చానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.