అందరికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు: ఉప సభాపతి పద్మారావు గౌడ్

అందరికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు: ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు.  అమన్ వేదిక కోవిడ్ రిలీఫ్ అండ్ కేర్ సంస్థ అధ్వర్యంలో సితాఫలమండీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో మొబైల్ వాక్సిన్ క్యాంపు ను మంగళవారం నుంచి ఏర్పాటు చేయనున్నారు.  ఈ పోస్టర్ ను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమన్ వేదిక ప్రోగ్రాం డైరెక్టర్  శ్రీమతి నమ్రత జైస్వాల్, ప్రతినిధులు నసీర్ సిద్దిక్, ఖాసిం, రామా రాణి, ఆశ జ్యోతి తెరాస నాయకుడు శ్రీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.