ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశాడు: వైఎస్ షర్మిల

ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశాడు: వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్ షర్మిల రోజు రోజుకు ప్రజల పక్షాన పోరాడటంలో దూకుడు పెంచుతోంది. తాజాగా నిజామాబాదు,ఆదిలాబాద్ జిల్లా నాయకులతో అభిమానులతో లోటస్ పౌండ్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాదు ఎంపీ అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఎన్నికల సందర్బంలో రైతులుకలు ఇచ్చిన హామీ పై ఆమె మాట్లాడారు. పసుపు బోర్డు తెస్తానని రైతులను మోసం చేశాడని ఆమె అన్నారు. అయన రైతులకు రాసి ఇచ్చిన బాండ్ ఎక్కడికి పోయింది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. బైంసా మత‌క‌ల్లోలాలు సృష్టించ‌డంపై ఉన్న ఆసక్తి రైతులపైనా ఎందుకు లేదని ఆమె అన్నారు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంత కష్టమా అని అన్నారు. పసుపు రైతుల కష్టాలు కనిపించడం లేదా అంటూ ఆమె అరవింద్ ను ప్రశ్నిచారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మెం రైతుల పక్షాన నిలబడి వారి దీవెనలతో మా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం అని ఆమె అన్నారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తోనే రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని నిజామాబాదు,ఆదిలాబాద్ జిల్లా నాయకులతో అభిమానులతో లోటస్ పౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published.