ఎమ్మెల్సీ కవిత క్వారంటైన్ లోకి..

ఎమ్మెల్సీ కవిత క్వారంటైన్ లోకి..

హైదరాబాద్: కరోనా వ్యాప్తి మళ్ళీ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుంది. ఇప్పటికే పదుల కరోనా కేసుల నుండి వందల కేసులు నమోదవుతున్నాయి. తాజా ఎమ్మెల్సీ కవిత కుటుంబం కూడా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. మొదట కవిత భర్త అనిల్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేసుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ క్రమంలో కవిత భర్త అనిల్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు. అనిల్ తో పాటు మిగితా కుటుంబ సభ్యులు కూడా సెల్ఫ్ క్వారంటైన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆమె రోజు వారి కార్యక్రమాలను తొందర్లో తమ ఆఫీస్ ద్వారా తెలియజేస్తా అని కవిత అన్నారు. అందరు కరోనా నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కవిత సూచించారు.

Leave a Reply

Your email address will not be published.