యాంకర్ గా గంగవ్వ.. నాగార్జునకు ప్రశ్నల వర్షం..

యాంకర్ గా గంగవ్వ.. నాగార్జునకు ప్రశ్నల వర్షం..

హైదరాబాద్: యూట్యూబ్ వీడియోస్ ద్వారా ప్రజలకు దేగ్గరై ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా కుటుంబ సభ్యురాలుగా ప్రతి తెలుగు వారి మనసు దోచుకున్న గంగవ్వ. బిగ్ బాస్ సీజన్ 4 లో గంగవ్వే పెద్దది కావడంతో మిగతా సభ్యులంతా తనని పెద్ద దిక్కుగా భావించి ఎంతో గౌరవంగానూ చూసుకున్నేవారు. కానీ కొన్ని కారణాల వాళ్ళ గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌజ్ నుండి బయటికి వచ్చేసిన విషయం అందరికి తేలిసిందే.

అయితే తాజాగా అక్కినేని నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ సినిమా ఏప్రిల్ 2న భారీ స్థాయిలో రిలీజ్ ఆవుతుంది . ఈ నేపథ్యంలో నాగార్జున ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్‌లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ యాంకర్ గా మరి నాగార్జునను ఇంటర్వ్యూ చేసింది. ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె నాగ్ ను అడిగి తెల్సుకుంది గంగవ్వ. సినిమా కు సంబంధిచిన విషయాలే కాకా నాగ్ కుటుంబం గురుంచి కూడా అడిగి తెల్సుకుంది. గంగవ్వ అడిగిన ప్రతి ప్రశ్నకు నాగార్జున నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. మీ చిన్న కొడుకు పెళ్లి ఎప్పుడు అని అడిగితే ఆ పెళ్లి విషయం అఖిల్ కె వదిలేశానని నాగ్ సమాదానం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published.