కరోనా సోకి 15 ఏళ్ల బాలికకు మాటలు పడిపోయాయి..
ఆర్.బి.ఎం డెస్క్ : కరోనా సోకి15 ఏళ్ల బాలికకు మాటలు పడిపోయిన ఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొరోనాకు కారణమైన సార్స్‌కోవ్-2 వైరస్ నాడీ మండలంపై తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఇది సంకేతమని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. ఆ బాలిక శ్వాస కోస సమస్యతో ముందు ఆస్పత్రిలో చేరింది. ఆమెకు గొంతు సంబంధిత పక్షవాతం వచ్చినట్లు వైద్యులు తెలుసుకున్నారు. ఆపరేషన్ చేసి గొంతులో గొట్టం అమర్చి శ్వాస తీసుకునేలా చేశామని డాక్టర్లు తెలిపారు. ఈ పరిస్థితి 13 నెలల పాటు కొనసాగిందని వైద్యులు వెల్లడించారు.