Amitabh Bachchan: రాజకీయ వివాదం వేళ అమితాబ్ ట్వీట్..!
ఆర్.బి.ఎం: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన ‘భారత్ మాతాకీ జై’ అని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు.. అంతే కాకుండా ‘భారత్’ (Bharat)గా సంబోధించడం మొదలుపెట్టిన నేపథ్యంలో ఈ ట్వీట్ చేయడం గమనార్హం. వచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దేశం పేరును భారత్‌గా మాత్రమే స్థిరపర్చేలా ప్రత్యేక బిల్లును తీసుకొస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అమితాబ్ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయనకు మద్దతు పలకగా మరి కొందరు మాత్రం ”జయా జీ అంటే మీకు భయం లేదా” అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా భారత్ అధ్యక్షతన జీ-20 సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి అందరికి విదితమే. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 9న ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. దీని ఆహ్వాన పత్రాల్లో President of India అని బదులుగా President of Bharat అని ప్రచురించారు. దీనిని తప్పు పడుతూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు..