కాంగ్రెస్‌కు భారీ షాక్.. సిద్ధూ రాజీనామా

కాంగ్రెస్‌కు భారీ షాక్.. సిద్ధూ రాజీనామా

ఆర్.బి.ఎం  ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. అయితే తాను పార్టీ బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకుంటున్నాని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పంజాబ్ పీసీసీ ఛీప్‌గా నియమించింది. ఇటీవల పంజాబ్‌కు కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ అధిష్టానం నిమయించింది. అంతకుముందు సీఎంల రేస్‌లో సిద్ధూ కూడా ఉన్నారు. అనూహ్యంగా చరణ్‌జిత్‌ను సీఎంగా నియమించారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తితో రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.