హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

ఆర్.బి.ఎం హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అక్టోబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 2న ఓట్లును లెక్కిస్తారు. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది.

మాజీమంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అనివార్యంగా హుజురాబాద్‌కు ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. జూన్ 4న ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దాన్ని అసెంబ్లీ స్పీకర్ 12న ఆమోదించారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ తరపున ఈ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్ గెల్లు శ్రీనివాస్‌ను బరిలోకి దింపుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తమ అభ్యర్థి ప్రకటించలేదు. అభ్యర్థి ఎంపిక కోసం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనర్సింహా నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఈ కమిటి పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.