ఆస్పత్రిలో చేరిన సచిన్..
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గత కొద్దీ రోజులు క్రితం కరోనా టెస్టు చేసుకోగా స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యుల సూచనలమేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి తన ఆరోగ్యపరిస్థితులను ఎప్పటికపుడు వైద్యులకు తెలుపుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సచిన్ తన నివాసంలోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయితే తాజాగా సచిన్ ను వైద్యులు ఆస్పత్రిలో చేరమని చెప్పగా సచిన్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. తన ఆరోగ్యం పట్ల ఎవరు భయపడవద్దని సచిన్ పేర్కొన్నారు. తన ఆరోగ్యం తొందరగ కుదుటపడాలని తన కోసం ప్రార్ధనలు చేస్తున్న వారికీ అయన కృతజ్ఞతలు తెలిపారు. తొందర్లోనే తన ఆరోగ్యం కుదటపడుతుంది అని సచిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.