ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంట విషాదం..

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంట విషాదం..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ప్రముఖ న్యూస్ ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇంట తీవ్ర విషాదం. ఆంధ్రజ్యోతి పబ్లిషర్ రాధాకృష్ణ బావమరిది కోగంటి శేషగిరి రావు కుమారుడు కోగంటి సతీష్ శుక్రవారం మధ్యాహ్నం స్వర్గస్థులైయ్యారు. రోడ్డు ప్రమాదం కోగంటి సతీష్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సూర్యపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద చోటుచేసుకుంది.

కోగంటి సతీష్ తన కారులో హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న క్రమంలో తన కారుకు ఎదురుగ వెళ్తున్న సిమెంట్ టాంకర్ ను గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సిమెంట్ టాంకర్ ను తన కారుతో బలంగా ఢీకొట్టడంతో కోగంటి సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు మునగాల ఎస్సై శ్రీనివాస్ నాయక్ వెల్లడించారు . అయితే ఈ క్రమంలో రాధాకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published.