వైఎస్ షర్మిల కొత్త పార్టీలోకి తీన్మార్ మల్లన్న?

వైఎస్ షర్మిల కొత్త పార్టీలోకి తీన్మార్ మల్లన్న?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తీన్మార్ మల్లన్న తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ టీవీ యాంకర్. తెరాస ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు వేలెత్తి చూపుతూ ప్రభుత్వానికి ఓ ప్రతిపక్ష నేతగా నిలుస్తూ ప్రజలకు చేరువయ్యాడు తీన్మార్ మల్లన్న. తాజాగా జరిగిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పొట్టి చేసి అధికార పార్టీకే చుక్కలు చూపించారు తీన్మార్ మల్లన్న.

తాజాగా తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలు సంచలంగా మారాయి. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పై మల్లన్న మాటలు దుమారం రేపుతున్నాయి. ఏ రాజకీయ పార్టీని కూడా వదలకుండా తన మాటలతో తూటాలా ప్రశ్నిచే మల్లన్న ఇప్పుడు వైఎస్ షర్మిల పట్ల ఆప్యాయత చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎవరైనా ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు ప్రాంతీయ బాషా తేడాలు ఉండవ్ అని తీన్మార్ మల్లన వ్యాఖ్యానించారు. షర్మిల తెలంగాణాలో నూతనంగా ఏర్పాటు చేయబోయే పార్టీ పట్ల తీన్మార్ మల్లన్న అనుకూలంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె ను తెలంగాణ ప్రజలు గుండెలకు అత్తుకొని స్వాగతిస్తారని మల్లన్న పేర్కొన్నారు. తెలంగాణాలో షర్మిలకు రాజకీయ భవిష్యత్తు ఉన్నటు తనకు కనిపిస్తోందని మల్లన్న వ్యాఖ్యానించారు. అదేవిధంగా షర్మిల తెలంగాణ ఆడపడుచు అని ఆ విషయాన్ని అందరు గుర్తించాలని అయన తెలిపారు.

షర్మిలను ఒక రాజకీయ శక్తిగానే చూడాలని ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంత బేధాలు చూపించకూడని తెలంగాణ ఆడపడుచుగా చూడాలని మల్లన్న సూచించారు. ప్రభుత్వాలను ఎలా నడపాలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలో ఆ కుటుంబానికి తెలుసు అని మల్లన్న తెలిపారు.

కాగా మల్లన్న మాత్రం ఏ పార్టీలో చేరబోనని ఇప్పటికే ఎన్నో పార్టీలు తనను పార్టీల్లోకి ఆహ్వానించాయని తాను మాత్రం ఏ పార్టీలో చేరానని మల్లన్న ధీమా వ్యక్తం చేసారు. రాజకీయ పార్టీల జెండా ఎప్పటికి మోయానని తన అజెండా కేవలం ప్రజలకు సేవ చేయడమేనని మల్లన్న వెల్లడించారు.

తీన్మార్ మల్లన్న వెనుక ఏవో రాజకీయ శక్తులు ఉన్నాయని వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం కాదని ఆయన్ని పేర్కొన్నారు. తాను రాజకీయ నాయకుడిగా కాకుండా సామాన్యుడిగా ప్రజలకు సేవ చేస్తా అని తెలిపారు. షర్మిల తన అన్న వైఎస్ జగన్ జైలు లో ఉన్నపుడు పార్టీ పూర్తి బాధ్యతలు షర్మిల తన బుజాలపై వెస్కొని పార్టీని నిలబెట్టింది అని మల్లన్న మరోసారి గుర్తుచేశారు.

తెరాస పార్టీ ప్రజలకు దూరంగా ఉంది నాయకులకు దెగ్గరగా ఉంది అని మల్లన్న అన్నారు. షర్మిల మాత్రం ప్రజలకు దెగ్గరగా ఉంది అని తెలిపారు. నన్ను ఏ పార్టీ కార్యకర్త వచ్చి అడిగిన వారికీ పనిచేస్తా పార్టీని చూడ. నేను పార్టీకి వ్యతిరేకం కానీ పార్టీలోని వ్యక్తులకు కాదు అని నిర్మొహమాటంగా అన్నారు. ఏ పార్టీకి వత్తాసు పలికే ప్రసక్తే లేదని మల్లన్న తెలిపారు

Leave a Reply

Your email address will not be published.