మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్.. ఇలా చేస్తే టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు..

మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్.. ఇలా చేస్తే టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదు..

అమరావతి: కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ చురకలంటించారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై జగన్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సర్వే నివేదికను సీఎం బహిర్గతం చేశారు. గడపగడపకు కార్యక్రమంలో 27 మంది చురుకుగా లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, 27 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రోజా, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావుకు క్లాస్ పీకారు.

పనిచేయని వారి పేర్ల లిస్టును జగన్ చదివి వినిపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై కూడా అసహనం వ్యక్తం చేశారు. 70 రోజుల్లో 15 రోజుల కంటే తక్కువ కాలం తిరగడం సమంజసం కాదన్నారు. 27 మంది 16 రోజులు మాత్రమే తిరిగారని, వారి పేర్లు వెల్లడించే పరిస్థితి తీసుకురావద్దని జగన్ సూచించారు. పనితీరు మెరుగుపరచుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటానని జగన్ హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే సీటు ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published.