భారత్ బౌలర్ల దెబ్బకు..సౌతాఫ్రికా బ్యాటింగ్ విలవిల..

తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టీ20లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బౌలర్ల కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెలరేగిపోయారు. దీంతో 9 పరుగులకే సౌతాఫ్రికా 5 కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో కురుకుపోయింది. అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, దీపక్ చహర్ 2 వికెట్లతో దక్షిణాఫ్రికాను దెబ్బతీశారు. తొలి ఓవర్ లోనే కెప్టెన్ టెంబా బవువాను చాహర్ ఔట్ చేసి శ్రీకారం చుట్టాడు. తర్వాత ఓవర్ వేసిన అర్షదీప్ కూడా రెచ్చిపోయి మూడు వికెట్లు తీసి సఫారిల నడ్డివిడిచారు.

తొలుత డికాక్ (1)ను బౌల్డ్ చేసిన అర్షదీప్… అదే ఓవర్లో చివరి రెండు బంతులకు రిలీ రూసో (0), ప్రమాదకర డేవిడ్ మిల్లర్ (0)లను డకౌట్ చేయడంతో టీమిండియాలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసింది. ఆ తర్వాత చహర్ మరోసారి విజృంభించి దక్షిణాఫ్రికా యువకెరటం ట్రిస్టాన్ స్టబ్స్ (0)ను పెవిలియన్ కు పంపాడు. దీంతో సౌతాఫ్రికా కోలుకోలేని పరిస్థితిని కొనితెచ్చుకుంది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 12 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 50 పరుగులు చేసింది. క్రీజులో మహారాజ్ (5 బ్యాటింగ్), వేన్ పార్నెల్ (16 బ్యాటింగ్) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.