జగన్ బంపర్ ఆఫర్.. ప్రజలు నమ్మతారో లేదో..

జగన్ బంపర్ ఆఫర్.. ప్రజలు నమ్మతారో లేదో..

సీఎం జ‌గ‌న్ మొహంలో ఆనందం క‌నిపించింది. కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ పరిధిలో నిర్మించిన రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమను జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని, ప‌రిశ్ర‌మ‌ల ఊసే లేద‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన సిమెంట్ ప్యాక్టరీని ప్రారంభించి గట్టి సవాల్ విసిరారు. సిమెంట్ ప్యాక్టరితో 1000 మందికి ఉద్యోగాలు వ‌స్తాయ‌ని తెలిపారు. ఇందులో స్థానికుల‌కే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల‌ని చ‌ట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలో గ్రీన్‌ కో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామ‌న్నారు.

రానున్న నాలుగేళ్ల‌లో 20వేల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ వరుసగా 3వ సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింద‌ని ఆయన సంతోషం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరం పొలం లీజుకు ఇస్తే ఏటా రూ. 30వేల రూపాయలు ఇస్తారని, అదే పది ఎకరాలిస్తే మూడు లక్షల రూపాయలిస్తారని తెలిపారు. లీజు పరిమితి ముగిశాక ఎవరి భూములు వారికే ఇస్తామని ప్రకటించారు. ఎకరానికి ముఫ్ఫై వేలు ఇవ్వడమే కాకుండా మూడేళ్లకోసారి ఐదు శాతం లీజు పెంచుతామని తెలిపారు. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా ఉండాల‌న్నారు. అయితే ఈ భూములన్నీ ప్రభుత్వం తీసుకుని, సంప్రదాయ విద్యుత్ సంస్థలకు అప్పగిస్తుంది. ఇటీవలి కాలంలో జగన్ పదివేల మెగావాట్లకు ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published.