రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో సంస్మరణ సభ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సభలో పాల్గొనేందుకు హీరో ప్రభాస్ మొగల్తూరుకు వెళ్లారు. సొంతూరుకు ప్రభాస్ దాదాపు 12 ఏళ్ల తర్వాత వచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. మొగల్తూరులో సందడి వాతావరణం నెలకొంది. తన కుటుంబసభ్యులతో కలిసి అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు. అభిమానుల కోసం ప్రభాస్ టీమ్ పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేసింది. 25 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. పోలీసులు ముందస్తుగానే భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అభిమానులకు 25 రకాల వంటకాలు
