ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లీ కూతుళ్లు అపార్టుమెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన గొల్లపూడిలో చోటు చేసుకుంది. ఆరో అంతస్తు నుంచి దూకడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మణం చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు సత్యవతి, మాధవిగా గుర్తంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.