హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు. ‘మిషన్ భగీరథ’ పథకానికి కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ పురస్కారం లభించింది. ఈ పథకం నాణ్యత, పరిమాణం విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖను పంపించింది. అక్టోబర్ 2న జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. విషయాన్ని కేంద్రం గుర్తించడంపై ధన్యవాదాలు తెలుపుతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.