ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూసహకరించాలి: శ్రీకాంత్ రెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూసహకరించాలి: శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం రాయచోటి: పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణం లోని జాతీయ రహదారి నేతాజీ సర్కిల్ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ ఇలాండ్స్ ప్రారంభంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, డిఎస్పీ శ్రీధర్, అర్బన్ సి ఐ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాషలుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సహకారం, పోలీసు శాఖ, దాతల సహకారంతో పట్టణంలో 15 ట్రాఫిక్ ఐలాండ్స్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని ప్రమాదాలను నివారించాలని కోరారు.

ట్రాఫిక్ ఐలాండ్స్ ఏర్పాటు వల్ల విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎండ, వాన ల నుంచి రక్షణ పొంది మరింత మెరుగ్గా విధులు నిర్వహించే సౌకర్యం కలుగుచుండడం సంతోషదాయకమన్నారు.రాయచోటి పట్టణంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నిర్మాణపు పనులుకూడా త్వరలో మొదలవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ ఐ ఇనాయతుల్లా , పట్టణ ఎస్ ఐ లు నరసింహా రెడ్డి, మహమ్మద్ రఫీ, నాయకులు అన్నా సలీం, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, గువ్వల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.