పేదలకు సైతం అధునాతన హంగుల వైద్యం : తీగుల్ల పద్మారావు గౌడ్

పేదలకు సైతం అధునాతన హంగుల వైద్యం : తీగుల్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న నేపధ్యంలో పేదలకు ఉపకరించేలా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఏర్పాట్లు జరుపుతోందని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. జంట నగరాల్లో కొత్తగా 32 బస్తీ దవాఖానలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించగా, అంబర్ పెట్ , దూద్ బావి ప్రాంతాల్లో ఈ బస్తీ దావాఖనాలను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర వ్యాప్తంగా 350 బస్తీ దావాఖనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే 226 కేంద్రాలను అందుబాటు లోకి తెచ్చామని తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్ల కు అదనంగా ఏ వైద్య సేవలు అందుబాటులో లేని బస్తీ లను ప్రత్యేకంగా గుర్తించి ఈ క్రమంలోనే బస్తీ దవాఖానాల ను ఏర్పాటు చేస్తున్నాము. బ్లెడ్ టెస్ట్ వంటి సాధారణ వైద్య పరీక్షల నుంచి ECG/MRI తో పాటు ఏకంగా 108 రకాల ఏంతో విలువైన్ వైద్య సేవలను పూర్తి ఉచితంగా అందించేందుకు dayagnostic హబ్ కేంద్రాలను నగర వ్యాప్తంగా ప్రారంభించామని ఆయన అన్నారు.

32 కేంద్రాలను ఈ రోజు ప్రారంభిస్తున్నాము. వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అందరు కోవిడ్ వాక్సిన్ పొంది మహమ్మారి బారి నుంచి రక్షించుకోవాలని, వివిధ జాగ్రత్తలు పాటించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

అంబర్ పెట్ ఎం ఎల్ ఏ శ్రీ కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు శ్రీమతి దుసరి లావణ్య, శ్రీమతి రాసురి సునిత, కుమారి సామల హేమ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఉప కమీషనర్ మోహన్ రెడ్డి, తెరాస యువ నేతలు కిశోర్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.