తాగునీరు, పారిశుద్ధ్యంలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: శ్రీకాంత్ రెడ్డి

rbm

తాగునీరు, పారిశుద్ధ్యంలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: శ్రీకాంత్ రెడ్డి

  • కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయండి
  • సమావేశంలో చర్చించిన అంశాలను పరిష్కరించకపోతే ఎలా ?
  • అధికారులతో సమీక్షలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం రాయచోటి: పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణలపై అధికారులు ప్రత్యేకశ్రద్ద పెట్టాలని ప్రభుత్వ చీఫ్ ప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ భాష అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. వార్డుల పరిధిలోని సమస్యల పరిష్కారానికి అధికారులు, కౌన్సిలర్లు సమన్వయంతో పనిచేయాలంటూ కోరారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి పనులలో పరస్పరం సహకరించుకోవాలన్నారు. కౌన్సిలర్లు తమదృష్టికి తీసుకువచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సచివాలయ కార్యదర్శులు కృషిచేయాలన్నారు. పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు కౌన్సిలర్లు, అధికారులు కృషిచేయాలన్నారు.

సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్యసిబ్బంది ఆశించిన మేర పనిచేయడం లేదంటూ కొందరు కౌన్సిలర్లు చీఫ్ విప్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఆయన స్పందిస్తూ పనిచేయని వారితో ఖచ్చితంగాపనిచేయించుకోవాలన్నారు. ఎంతచెప్పినా పనితీరుతో మార్పు రాకపోతే వారి స్థానంలో కొత్తవారిని నియమించుకో వాలంటూ సూచించారు. అవసరమనుకుంటే మరింత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకోవాలంటూ కోరారు.పట్టణంలో జాతీయరహదారి కాలువల అసంపూర్తి కారణంగా నీరంగా కొత్తపల్లె వీధులలోకి ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు కౌన్సిలర్లు చీఫ్ విప్ కు తెలిపారు.

ఇందుకు ఆయన స్పందిస్తూ స్థల సేకరణలో ఎలాంటి సమస్య లేదుకదా అంటూ ఆడిగి తెలుసుకున్నారు. పనులు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ కమీషనర్ రాంబాబును ఆదేశించారు, ఎన్ హెచ్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తిచేయించి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలంటూ కమిషనర్ కు సూచించారు. పట్టణంలో పలువీధులకు సక్రమంగా తాగునీటి సరఫరా జరగక ఇబ్బందులు పడుతున్నారంటూ కౌన్సిలర్లు చీఫ్ విప్ దృష్టికి తీసుకువచ్చారు. పలుచోట్ల ఎయిర్ వాల్వులు సరిగా పనిచేయడం లేదంటూ తెలిపారు. ఇందుకు శ్రీకాంత్ రెడ్డి స్పంది ఎయిర్వాల్వుల పనితీరు పరిశీలించి అవసరమైన చోట కొత్తవాల్వులను ఏర్పాటు చేయాలన్నారు.

ఎట్టిపరిస్థితులలో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ ఎఈ వెంకటక్రిష్ణారెడ్డి, డిఈ నాయక్ ను ఆదేశించారు. మున్సిపల్ వాటర్ సెక్షన్ లో ఉన్న ఉద్యోగులను మిగిలిన విభాగాలలో వినియోగించుకోవడం, అవసరానికి మించి ఎక్కువ మంది ఉద్యోగులు ఉండడంపై చర్చ జరిగింది. ఇందుకు స్పందించిన శ్రీకాంత్ రెడ్డి వాటర్ సెక్షన్లోని 84 మంది ఉద్యోగులు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ? ఎక్కువ మంది ఉద్యోగులను వెలిగల్లు వాటర్స్కీంలో ఎందుకు పనిచేయిస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. పలు విభాగాలలో ఉన్న వాటర్సెక్షన్ ఉద్యోగులను అక్కడ నుండి వెనక్కుతీసుకురావాలని ఆదేశించారు. గత సమావేశంలో ఇదే చర్చజరిగినా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ శ్రీకాంత్ రెడ్డి అధికారులపై మండిపడ్డారు. పార్కుల నిర్మాణం, నాలుగువరుసల జాతీయ రహదారి మధ్యలో డివైడర్ల ఎత్తు,సుందరీకరణ పనులుపై శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు.

Leave a Reply

Your email address will not be published.