మహిళల ఆర్థిక స్వయం సంవృద్దే లక్ష్యం: శ్రీకాంత్ రెడ్డి

మహిళల ఆర్థిక స్వయం సంవృద్దే లక్ష్యం: శ్రీకాంత్ రెడ్డి

  • సూపర్ మార్కెట్లుకు ధీటుగా జగనన్న మహిళా మార్ట్ ను తీర్చిదిద్దుతాం..
  • తక్కువ ధరలతో, నాణ్యమైన సరుకులు అందించి ప్రజల మన్ననలు పొందేలా మార్ట్ అభివృద్ధి..
  • రాయచోటిలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటయిన జగనన్న మహిళా మార్ట్ ప్రారంభంలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం:  మహిళల ఆర్థిక సంవృద్దే సీఎం జగన్ లక్ష్యమని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.ఆదివారం రాయచోటి పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో మెప్మా కార్యాలయం వద్ద ఏర్పాటైన జగనన్న మహిళా మార్ట్ ప్రారంభ కార్యక్రమంలో మెప్మా ఎండి విజయలక్ష్మీ, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, కమీషనర్ రాంబాబు లతో కలసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు. పూర్తిగా డ్వాక్రా మహిళలే యజమానులుగా జగనన్న మహిళా మార్ట్‌ పేరుతో సూపర్‌ మార్కెట్ ను ఏర్పాటు చేసిందన్నారు.పట్టణ సమాఖ్యల సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా, పురపాలకశాఖ మౌలిక వసతుల కల్పనతో,పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆర్థిక సహకారంతో ఈ మార్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సమాఖ్య సభ్యులు రూ.150 చొప్పున మూలధన నిధికి జమచేసి, రూ.15 లక్షల పెట్టుబడి నిధిగా సమకూరిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్ వైఎస్సార్‌ చేయూత, వంటి పథకాలను కూడా ఈ మార్ట్‌కు వర్తింపజేస్తా రన్నారు. దీనికి అవసమైన సరుకుల సరఫరా కోసం కార్పొరేట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేందుకు మెప్మా సహకరిస్తుందన్నారు.కార్పొరేట్‌ సంస్థలు నిర్వహిస్తున్న సూపర్‌ మార్కెట్లకు దీటుగా జగనన్న మహిళా మార్ట్‌ను తీర్చిదిద్దుతామన్నారు. మెప్మా ఎండి విజయలక్ష్మీ మాట్లాడుతూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషి,సహకారంతో రాయచోటిలో జగనన్న మహిళా మార్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇతర మార్ట్ ల కంటే ఇక్కడ తక్కవ ధరలతో, నాణ్యమైన సరుకులను అందించి ప్రజల మన్ననలును పొందడం జరుగుతుందన్నారు.మార్ట్ నిర్వహణపై వివిధ టీం లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.

మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష మాట్లాడుతూ జిల్లాలో పులివెందులలో ఏర్పాటయిన జగనన్న మాహిళా మార్ట్ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మార్ట్ పట్టణ వాసులుకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి కూడా ఎంతో సౌలభ్యంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మెప్మా రాష్ట్ర అధికారులు ఆదినారాయణ, శ్రీనివాసరావు,జిల్లా పి డి రామ్మోహన్ రెడ్డి,చిత్తూరు జిల్లా పిడి, రాయచోటి మెప్మాఅధికారి నాగరాజు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు మరియు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.