మహిళాభ్యున్నతే జగన్ ప్రభుత్వ ధ్యేయం: శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: మహిళాభ్యున్నతే జగన్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం గాలివీడు మండలంలోని పందికుంట,గరుగుపల్లె గ్రామాల స్వయం సహాయక సంఘాలకు వేర్వేరుగా జరిగిన రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా సదస్సులలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలుకు ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారన్నారు.

సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ను ఏర్పాటు చేసి,ఏ పథకాన్నై నా నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నారన్నారు. రైతులకు పెట్టుబడి నిధి క్రింద ఆర్థిక సహాయం, నేతన్న నేస్తం, వై ఎస్ ఆర్ చేయూత, ఆసరా తదితర ఎన్నో పథకాలును అమలు చేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల ద్వారా విద్యార్థులుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు.మహిళలకు భద్రతగా దిశ చట్టం, మహిళా పోలీసు స్టేషన్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలును సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.

మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లును కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. కొత్త ఏడాదిలో అవ్వా తాతలకు పెన్షన్ మొత్తాన్ని రూ 2250 నుంచి రూ 2500 పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వచ్చే నెల జనవరి ఒకటవ తేదీ నుంచి అమలు చేయడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ ఆసరా రెండవ విడతలో పందికుంటలో 32 సంఘాలకు రూ 16.25 లక్షలు, గరుగుపల్లెలో 25 సంఘాలకు రూ 12.8 లక్షలు లబ్దిపొందు చున్నారన్నారు.ఏకకాల పరిష్కార సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్దిదారులెవ్వరూ ఆందోళన చెందొద్దని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

ఇది రైతుల ప్రభుత్వం…
జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అధిక వర్షాలుతో పంటలు నష్టపోయి ఈ క్రాపింగ్ చేయించుకున్న రైతులకు జనవరి లోగా పరిహారం అందచేస్తామన్నారు. రైతన్నల సంక్షేమానికి అనునిత్యం కృషిచేస్తామన్నారు. రైతులు పాడిపంటలుతో సుభిక్షంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.

సమస్యల పరిష్కారానికి కృషి..
సమావేశాలనంతరం శ్రీకాంత్ రెడ్డి ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పందికుంట గ్రామానికి వెలిగల్లు నీటిని అందేలా చర్యలు చేపడతామన్నారు. అధిక వర్షాలుతో దెబ్బతిన్న రహదారులకు త్వరితగతిన మరమ్మత్తులు చేపడతామన్నారు.

ఈ సమావేశాలలో ఎంపిపి జల్లా సుదర్శన్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవుల నాగభూషణ రెడ్డి, యదుభూషన్ రెడ్డి, ఖాదర్ మొహిద్దీన్, మాజీ ఎంపిపి బండి చిన్నరెడ్డి, యువజన విభాగపు రాష్ట్ర కార్యదర్శి గుమ్మా అమరనాధ రెడ్డి, సర్పంచులు ఉమాపతి రెడ్డి,జానకమ్మ, హనుమాన్ నాయక్, మాజీ సర్పంచ్ ఖాసీం సాహెబ్, ఎం పి టి సి నాయక్, శివగంగాధర్ నాయుడు, నాగశేఖర్ నాయుడు,సిద్దయ్య, ప్రభాకర్ నాయుడు, ఏ ఆర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.