సవరణతో సామాన్యునికి మరింత చేరువుగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్ ధరలు: శ్రీకాంత్ రెడ్డి

సవరణతో సామాన్యునికి మరింత చేరువుగా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్ ధరలు: శ్రీకాంత్ రెడ్డి

  • చదరపు గజానికి రూ వెయ్యి తగ్గింపు
  • రూ.16 కోట్లతో త్వరితగతిన అభివృద్ధి పనులు
  • 30 రోజులలో లే ఔట్ అప్రోచ్ రోడ్ల నిర్మాణాల పూర్తికి అధికారుల ముమ్మర చర్యలు
  • ప్రభుత్వ స్పందనపై హర్షం తెలిలిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం: జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్స్ లో సామాన్యునికి మరింత చేరువుగా ఉండేలా సవరణలు చేపట్టడం పై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.చదరపు గజం స్థలం రూ.5599 గా నిర్ణయించిన ధరను ప్రభుత్వం 4599కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇలా చేయడం వలన వెయ్యి రూపాయల మేర తగ్గి సామాన్యునికి మరింత మంచిది అయిందన్నారు. ధరల విషయంపై జిల్లా అధికారులతో తాను చర్చించడంతో జిల్లా జేసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ధరను తగ్గించేలా చేశారన్నారు. రాయచోటిలో చేపట్టనున్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లే ఔట్స్ కు సంబంధించిన అప్రోచ్ రోడ్లను 30 రోజుల్లో పూర్తి చేయించేలా అధికారులు చర్యలు చేపట్టారన్నారు. అలాగే రూ.16 కోట్లతో అన్ని వసతులతో కూడిన అభివృద్ధి పనులకు
టెండర్ పిలిచారన్నారు.ఈ పథకాన్ని ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.