భూగర్భ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి: శ్రీకాంత్ రెడ్డి

భూగర్భ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి: శ్రీకాంత్ రెడ్డి

  • వెలిగల్లు అదనపు నీటి పథకం, పార్క్ ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులుపై అధికారులుతో సమీక్షించి, క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ఆర్.బి.ఎం:  భూగర్భ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని పబ్లిక్ అండ్ హెల్త్ ఈఈ చెన్నకేశవ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ రాంబాబు లకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం శ్రీకాంత్ రెడ్డి తన కార్యాలయంలో ఉదయం 6 గంటలకే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఫయాజ్ భాష, ఫయాజర్ రెహమాన్ , జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, కౌన్సిలర్లతో కలసి పబ్లిక్ అండ్ హెల్త్, మున్సిపల్ అధికారులుతోనూ,కృషి ఇన్ఫ్రా స్ట్రక్షర్ ప్రతినిధులుతోనూ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు.

సమీక్ష అనంతరం పట్టణంలోని తిరుపతి నాయుడు కాలనీలో నిర్మాణ దశలలో ఉన్న భూగర్భ డ్రైనేజీ, పార్క్ , పట్టణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాలను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. రూ 236 కోట్ల నిధులుతో ప్రారంభమైన భూగర్భ డ్రైనేజీ పనుల స్థితిగతులుపైన చర్చించారు.6 ఎస్ టి పి ల స్థితిగతులును ఆయన అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ వెలిగల్లు అదనపు నీటి పథకం పైన ఆయన ఆరా తీశారు.ఎస్ టి పిలు, ఈ ఎల్ ఎస్ ఆర్ ల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణలు త్వరితగతిన పూర్తిచేయాలని రాయచోటి, గాలివీడు తహసీల్దార్లు సుబ్రమణ్యం రెడ్డి, శ్రావణి లకు ఆయన ఆదేశించారు.పార్క్ ల నిర్మాణాలు ఎందుకు ఆలశ్యం అవుతున్నాయని ఆయన ప్రశ్నించారు.

వెలిగల్లు త్రాగునీటి పథకంలో నూతన విద్యుత్ మోటార్ల ఏర్పాటుపై ఆయన చర్చించారు. పట్టణంలోని నాలుగు వరుసల రహదారిలో డివైడర్ల ఎత్తు , సుందరీకరణ పనులుపైన త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు.ఆర్ టి సి బస్ స్టాండ్ అభివృద్ధి పనులు టెండర్ దశలో ఉన్నాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ మరింత పటిష్టంగా అమలు పరచాలని ఆయన సూచించారు. మరింత బాధ్యత, పట్టుదలలతో అభివృద్ధి పనులు అధికారులు ముమ్మరం చేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో పబ్లిక్ అండ్ హెల్త్, మున్సిపల్ డి ఈ సురేష్, సుధాకర్ నాయక్, ఏ ఈ లు కృష్ణారెడ్డి, కావ్య, కౌన్సిలర్లు మదన మోహన్ రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, కొలిమి ఛాన్ భాష, ఫయాజ్ అహమ్మద్, గౌస్ ఖాన్, సాదిక్,పి ఆర్ టి యు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు శ్రీనివాస రాజు, అల్తాఫ్,జయన్న నాయక్, నవరంగ్ నిస్సార్,రియాజ్,భాస్కర్, మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, కో అప్షన్ అయ్యవారు రెడ్డి, గువ్వల బుజ్జిబాబు, జానం రవీంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.