ఏకకాల పరిష్కార సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్దిదారులెవ్వరూ ఆందోళన చెందొద్దు: శ్రీకాంత్ రెడ్డి

ఏకకాల పరిష్కార సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్దిదారులెవ్వరూ ఆందోళన చెందొద్దు: శ్రీకాంత్ రెడ్డి

  • డబ్బులు కట్టాలని ఎవ్వరినీ బలవంతం చేయకండి..
  • మున్సిపల్, హౌసింగ్ అధికారులుకు సూచించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.

ఆర్.బి.ఎం రాయచోటి: ఏకకాల పరిష్కార సంపూర్ణ గృహ హక్కు పథకంపై లబ్దిదారులెవ్వరూ ఆందోళన చెందొద్దని చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం శ్రీకాంత్ రెడ్డి తన కార్యాలయంలో మున్సిపల్, హౌసింగ్ అధికారులుతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇళ్ళు నిర్మించుకున్న లబ్దిదారులు తమ ఇళ్లపై సర్వ హక్కులు మరియు ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ దస్తావేజు పొందుటకు కల్పిస్తున్న సదావకాశమే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకమన్నారు.

అయితే కొందరు ప్రజలను అయోమయం చేయడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందు కోసం లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని , ఇటువంటి అపోహలును ప్రజలు పట్టించుకోవద్దని ఆయన కోరారు.సాధారణంగా గృహ నిర్మాణ సంస్థ వారిచే గృహాలు నిర్మించుకొనుటకు లబ్దిదారులకు రుణాలును మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

ఆ రుణం పూర్తిగా బాకీగా వుంటుందన్నారు ఈ పథకం ద్వారా తక్కువ మొత్తం చెల్లించి పూర్తి ఋణమాపీ పొందటం, మీ స్థిరాస్తిని రిజిస్టర్ చేసుకోవడం సులభతరమన్నారు.సదరు ఆస్తిని అమ్ముకొనుటకు గానీ, తనఖా పెట్టుకొనుటకు వీలుగా 22(ఏ) (1)(a) నిషేధిత జాబితా నుండి తొలగించడం జరుగుతుందన్నారు.ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకు రుణాలకు జామీను క్రింద దాఖలు పరచుకోవచ్చునన్నారు.

డబ్బులు చెల్లించాలని లబ్ధిదారులను ఎవ్వరినీ ఒత్తిడి చేయొద్దని ఆయన మున్సిపల్ కమీషనర్ రాంబాబు, హౌసింగ్ ఏ ఈ బిక్షం లను ఆదేశించారు.ఋణ మాపీ అవసరం వద్దన్నకున్నవారు డబ్బులు కట్టకపోయినా నష్టం జరగదని ప్రభుత్వం తరపున మాట ఇస్తున్నామన్నారు. స్వచ్చంధంగాను, స్తోమత ఉన్నవారు డబ్బులు చెల్లించవచ్చునని, స్తోమత లేనివారు కానీ,ఋణమాపీఅవసరం లేనివారు డబ్బులు కట్టనవసరం లేదన్నారు. డబ్బులు కట్టాలని అధికారులు ఎవ్వరైనా ఒత్తిడి చేస్తే లబ్దిదారులు తనను సంప్రదించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష,సర్పంచ్ ల సంఘ అధ్యక్షుడు చిదంబర్ రెడ్డి, మాజీ ఎం పి పి పోలు సుబ్బారెడ్డి, మదన మోహన్ రెడ్డి,చిట్లూరు మాజీ వైస్ ఎం పి పి మురళీధర్ రెడ్డి,గొర్లముదివీడు సర్పంచ్ రఘునాధ, మున్సిపల్ డిఈ సుధాకర్ నాయక్, ఏ ఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.