విద్యుత్ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ..

విద్యుత్ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ..

ఆర్.బి.ఎం వికారాబాద్: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు.

“మీతో నేను” కార్యక్రమంలో భాగంగా పర్యటించిన వికారాబాద్ మండలం, ధారుర్ మండలం మరియు మోమిన్ పేట్ మండలాల్లోని గ్రామాలలో విద్యుత్ సమస్యల పరిష్కార చర్యలు ఎంతవరకు వచ్చాయని వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామాల్లో క్రొత్త స్థంభాల (పోళ్ళు) ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్ ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని పంట పొలాల వద్ద వ్రేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని మరియు గ్రామాల్లో వీధి దీపాల ఆన్/ఆఫ్ కోసం ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

కొన్ని గ్రామాల్లో వీధి దీపాలు లేవని, వాటిని తొందరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ అధికారులు, సర్పంచులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.