భర్త రాసలీలలు.. అరగుండు గీసి ఊరేగించిన భార్య..

భర్త రాసలీలలు.. అరగుండు గీసి ఊరేగించిన భార్య..

ఆర్.బి.ఎం: శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లేపాక్షి మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఇదే విషయంపై భర్తను పలుమార్లు భార్య నిలదీసింది. అయినా అతనిలో మార్పు రాకపోవడంతో ఇవాళ లేపాక్షి మండలంలోని తిలక్ నగర్ లో మరో మహిళతో హుస్సేన్ ఉండగా. అతడ్ని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తకు, అతని ప్రియురాలికి భార్య అరగుండు కొట్టించి ఇద్దరికి చేతులు కట్టేసి గ్రామంలో ఊరేగించింది. శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలోని లేపాక్షి మండలం ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన జరిగింది. అయితే, ఈ జంట తిలక్ నగర్ లో ఉన్న విషయాన్ని గుర్తించిన మహిళ తన పేరేంట్స్ కు విషయం చెప్పడంతో ఈ జంటను పట్టుకుని చితకబాదారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న జంటకు అరగుండు గీసి ఊరేగించారు.
దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.