ట్రీట్మెంట్ నెపంతో నవవధువుపై నకిలీ బాబా అత్యాచారం..
ఆర్.బి.ఎం: బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి మూడు నెలల క్రితం వివాహం అయింది. కాగా ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్న బజార్ బాబా వద్దకు తీసుకెళ్లిన అత్త మామలు. బాబా నవవధువు కళ్లకు గంతలు కట్టి గదిలో బందించడాని అత్యాచారం చేశాడని బాధితురాలి ఆరోపణ చేసింది. విషయం బయటికి పొక్కడంతో పరారైన నకిలీ బాబా. అత్తమామలకు విషయం చెప్పినా స్పందన లేకపోగా ఆమెకు దయ్యం పట్టిందని ఇంట్లో బంధించిన వైనం. తల్లిదండ్రుల సహాయంతో భవాని నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు. ఘటన బండ్లగూడ ప్రాంతాల్లో జరిగింది కాబట్టి కేసును బండ్లగూడ రెఫర్ చేసిన భవాని నగర్ పోలీసులు. పోలీసులు సైతం న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని బాధితురాలి ఆందోళన.